Sunday, April 10, 2011

కాశ్మీర దీపకళిక

పదో క్లాసులో మాకు 'శ్రీనగర యాత్ర' అనే తెలుగు పాఠం ఉండేది. అది చదివేటప్పుడు శ్రీనగర్‍లో మేమున్నట్లే అనిపించేది! ఆ తెలుగు పుస్తకంలో ఏది గుర్తున్నా లేకపోయినా శ్రీనగర యాత్ర మాత్రం 'కాశ్మీర దీపకళిక' అని నాయని కృష్ణకుమారిగారు వ్రాసిన పుస్తకం లోనిది అన్న విషయం మాత్రం గుర్తుండిపోయింది. టెక్స్ట్ బుక్స్ మారిన తర్వాత ఆరవ తరగతికో ఏడవ తరగతికో అదే పుస్తకం నుంచి ఇంకో excerpt పెట్టారని తెలిసి అది కూడా చదివాను. Internet access వచ్చినప్పటి నుండీ ఆ పుస్తకం కోసం worldcatలో, digital library of indiaలో, archive.orgలో సంవత్సరానికి రెండు మూడుసార్లయినా వెతకటం అలవాటయిపోయింది. అలాంటిది అనుకోకుండా కడప Brown Libraryలో ఈ పుస్తకం దొరికింది! అది పూర్తిగా చదివిన తర్వాత ఈ పుస్తకం online ఉంటే కావలిసినప్పుడు శ్రీనగర్ వెళ్లొచ్చు కదా అనిపించింది! నేను ఈ మధ్యకాలంలో ఇంతగా enjoy చేసిన పుస్తకం మరొకటి లేదు; అది అందరూ చదవాలనే ఈ లింక్:

http://tinyurl.com/srinagarayatra

4 comments:

bandi.srinivassarma said...

Hello,
It's very nice to see old text books and all of suddent I was taken back to schooldays. My hearty greetings. Are you 1993 SSC passout...?

Regards,
B.Srinivas
bandi.srinivassarma@gmail.com

V G said...

I'm glad that you liked the blog. My SSC batch was 1996,

Thanks,
Vijay

Raju said...

Hi,



"ప్రక్కగా పోయే మరో షికారా నీళ్ళళ్ళో తొంగి చూసినప్పుడు, అన్ని సమయాల్లో ఆ వినీల గంభీర సరోవరం మనసుల్లో ఊహావలయాన్ని రేపి అందుకోలేనీఅ అందాన్ని, స్వంతం చేసుకోలేని ఆ రామణీయకాన్ని చూస్తూ తృప్తి చెందమని ఆదేశించింది."

ఇది బాగా గుర్తు నాకు. మీ post మళ్ళీ గుర్తుకు తెచ్చింది.

Thanks,
Seeta Rama Raju

nischee said...

yup...naku gurtundi adhi 7th class lo gadhya bhagam lo first lesson...Devadaru vrukshala gurinchi oka question kuda undedi :)