Monday, August 01, 2005

ఐదారేడు తరగతుల తెలుగు పుస్తకాలు

ఈ మూడు తరగతులూ కలిసిపోయి ఒక blur లా ఉన్నాయి.

పరివర్తన అని ఒక పాఠం ఉండేది. ఒకామె చాలా మంచిది కానీ ఆమె భర్త చెడ్డవాడు. ఆయన రాత్రిపూట ఒక మర్రిచెట్టు దగ్గరికెళ్తే బ్రహ్మరాక్షసుడిగా మారిపోవడంలాంటిదేదో చేస్తుంటాడు. ఇది ఐదనుకుంటా.

ఆర్కిమిడిస్ పైన ఒక పాఠం ఉండేది. దాని తర్వాతే దుర్గాదాస్(?) అనే ఆయన చిన్నప్పటి సంఘటన గురించి ఒక పాఠం ఉండేది. దుర్గాదాస్ (అనుకుందాం) ఢాకా వరకూ నడిచివెళ్లి చదువుకుంటుంటాడు. ఒకరోజు రాత్రి బాగా వర్షంపడుతుంది.

ఇనుపకండలు-ఉక్కునరాలు అనే పాఠంలో కోడి రామ్మూర్తిగారి గురించి ఉండేది.

ఏడులో మొదటిపాఠం సువర్ణష్ఠీవి. చాలామందికి గుర్తుండుంటుంది. అతడసలే "రూపసి" కూడా!

ఏడులో మాడపాటి హనుమంతరావు, మాగంటి(?) అన్నపూర్ణాదేవి (M.A.D అనేవారు) లపై పాఠాలుండేవి.

ఐదులోనేమో దుర్గాబాయి దేశముఖ్ పైన ఒక పాఠముండేది. ఆమెని చిన్నప్పుడు ఒక event కి కాపలా పెడితే నెహ్రూని కూడా టికెట్ లేకుండా లోపలికి రానివ్వదు.

ఇంకొక standard lesson ఉండేది. ఒక ముసలివాడు మామిడి టెంక నాటుతుంటే ఒక రాజు వెక్కిరిస్తాడు. ఆ ముసలివాడు అప్పుడు point explain చేస్తాడు. నార్లవారి రచన అనుకుంటా ఇది.

ఆరేడు తరగతుల్లో తెలుగు non-detailed texts మదర్ థెరెసా, సరోజిని నాయుడు అనుకుంటా.

పాఠంలో ఏముంటే మనకి ఏళ్లు గడిచినా గుర్తుంటుందనేదాన్ని రిసెర్చ్ చేయాలి. M.A.D లాంటివాటికి ఎవరూ ఏమీ చేయలేరుగానీ ప్రతిపాఠంలో కనీసం ఒక్క remarkable విషయాన్నన్నా పెట్టగలగాలి.

37 comments:

virinchipriya said...

Hi,
I never knew there was a blog about text books. I remember my telugu text material from my seventh grade.
we had 'Khadgatikkana', 'Andhrakalpavruksham'(tadi chettu gurimchi) i think this is by Panugantigaru,'trijataswapnamu' from 'Molla RAmayanam' Krushivaludu by Dr c. Narayanreddy and in Intermediate (83)we 'Swabhasha' chilakamartigaru(iam not sure), vigrahamu by chinnayasuri
for now i can only recollect a few can any one tell me where i can get swabhasha and krushivaludu
thankyou
priya

V G said...

This blog is about the text books used between 1986 (1st) and 1996 (10th). However, I remember a స్వభాష (పానుగంటి) from our 9th class. Not sure it's the same one you are talking about.

చదువరి said...

మీ బ్లాగు విషయం బాగుంది. నా జ్ఞాపకమొకటిక్కడ రాస్తున్నాను ..


ఆరో తరగతిలో చంద్రహాసుడు పాఠం ఉండేది, తెలుగులో. చంద్రహాసుణ్ణి చంపే కుట్రతో మంత్రి, సేనానికి చంద్రహాసుడి ద్వారానే ఒక ఉత్తరం పంపిస్తాడు. అందులో "ఇతనికి విషమునిమ్ము" అని రాసి ఉంటుంది. వెళ్ళేదారిలో చంద్రహాసుడు ఒక తోటలో విశ్రాంతి కోసం ఆగి కాసేపు కునుకు తీస్తాడు. మంత్రి కూతురు విషయ ఆసమయంలో అతడి అందం చూసి ప్రేమిస్తుంది. అతని వద్దనున్న ఆ ఉత్తరాన్ని చదివి, బాధపడి, తన కంటి కాటుకతో ఉత్తరం లోని విషమునిమ్ము అనే మాటను విషయనిమ్ము అని మార్చి, ఉత్తరాన్ని మళ్ళి అలాగే పెట్టేసి వెళ్తుంది.

ఇదేమీ తెలియని చంద్రహాసుడు, నిద్రలేచి, ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి, సేనానికిస్తాడు. ఉత్తరాన్ని చదివిన సేనాని మంత్రి కూతురు విషయను చంద్రహాసునికిచ్చి పెళ్ళి చేస్తాడు.

V G said...

I don't recall that lesson. May be the textbooks were different.

tankman said...

మాకు 7 లొ కాశ్మీరి గులిక అని ఒక పాఠం వుండెది .
రచయిత్రి పేరు మర్చ్పోయా!!

మొత్తం అంతా కాశ్మీరులొ ఆమె అనుభావాలు

చదువరి said...

చంద్రహాసుడి కథ 1975 నాటి సంగతండి.

V G said...

కాశ్మీర్ పాఠం రచయిత్రి నాయని కృష్ణకుమారి గారు అయ్యుండొచ్చు. ఆమె travelogue excerpt ఒకటి మాకు పదిలో 'శ్రీనగర యాత్ర' అనే పేరుతో ఉండేది.

V G said...

1975 నాటి తెలుగు textbooks దొరికే వీలుందంటారా?

Anonymous said...

"durga das" should be "Durga charan"

Sudheer said...

నాకు ఏడవ తరగతి లో వినాయకుడి గురించి ఒక పాఠం ఉన్నట్టు గుర్తు. అది చదివిన తర్వాతనే వినాయకచవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని తెలిసింది.

సుజాత వేల్పూరి said...

నాకు నా క్లాసు పుస్తకాలే కాక అన్నలు, అక్కలు, కజిన్లు అందరి క్లాసు పుస్తకాలు , ముక్యంగా తెలుగు వాచకాలు(కథల కోసం) చదివే అలవాటుండేది. చదువరి గారు చెప్పిన చంద్ర హాసుడి కథ 1975 లోనే కాక ఆ తర్వాత 80 ల్లో కూడా ఏ క్లాసుకో నాండిటేల్ లో ఉండేదనుకుంటాను.(లేకపోతే పుట్టగానే ఆ కథ చదవలేను కదా) విషయ తన కంటి కాటుక తో వాక్యాన్ని మార్చిన సంగతి కూడా నాకు గుర్తుంది.

అలాగే డొక్కా సీతమ్మ గారి కథ కూడా! దొంగకి కూడా అన్నం పెట్టిన ఆమె దాన గుణం చదువుతుంటే భలే స్ఫూర్తి దాయకంగా ఉండేది.

సుజాత వేల్పూరి said...

చదువరి గారు చెప్పిన చంద్ర హాసుడి కథ ను నేను "జీమూత వాహనుడు" అనే పేరుతో చదివినట్లు గుర్తొస్తోంది. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

కొత్త పాళీ said...

చదువరి చెప్పిన చంద్రహాసుడి కథ నాక్కూడా గుర్తుంది. తరవాత సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఎవరో చెప్పారు .. అది వొరిజినల్ గా సంస్కృత కథ అని. సంస్కృతంలో అ మంత్రిగారు విషం దదాతు అని రాసినదాన్ని ఆ అమ్మాయి విషయం దదాతు అని సవరిస్తుంది. ఆ తరవాత ఈ చంద్రహాసుడే జీమూతవాహనుడనే పేరుతో చక్రవర్తి అవుతాడనుకుంటా.

Anonymous said...

చంద్రహాసుడికి సంబంధించిన కథలో ఉత్తరంలో ఉన్నదిది. (నాకు గుర్తున్నది)" ఇతడహితుడు. విషమునిమ్ము". దీన్ని రాజకుమారి విషయ, కాటుకతో ఇలా మార్చింది. "ఇతడు హితుడు. విషయనిమ్ము."

ఇకపోతే, చంద్రహాసుడు అర్జునుడిని జయించాడని మా అవ్వ అప్పట్లో చెప్పిన కథ.

ఈ కథ, నేనూ ఎప్పుడో చదువుకున్నాను.

V G said...

చంద్రహాసుడి కథ ఒక version ఇక్కడుంది:
http://www.archive.org/details/chandrahasanaata018856mbp

pdf file page 25 లో విషయ చేసిన trick ఉంది.

Anonymous said...

V G: ఆ లింకు ఇచ్చినందుకు నెనరులు.

Anonymous said...

Dear all

Naaku 1995 lo telugu text book lo "Swabhasha" Jandyala Saastry maatlaaduthoo untaaru aa lesson ante praanam. A lesson evarikaina dorikithe please ravipaticpa@yahoo.com ki pampandi. Neenu Kruthagnudanu...

"Anni thalukuloo, anni belukulu, anni soyalu anni sogasulu, anni hoyalu, anni hoyyalaaru kaligina mana maathru bhaashaye" antaaru...entha goppaga pogudu taaro mana telugu ni...my all time favarite. Thank you

Anonymous said...

chaala anandamgavunnadi...nenu 2006 lo tenth class chadivanu..maku 9th lo great expectations(pip and estella) story undedi..trojan war 6th class lo undedi inka fact and fake ani 7th non detail lo kuda undevi..andulo world class writers yokka stories undevi..william shakespeare nunchi leo tolstoy lanti maha rachayithala stories ni chinnapude chadavagalatam mana adhrustam..ippati syllabus lo avi levu

Unknown said...

Kashmir dharshanam ah lesson rachaitha Nayini krishna kumari

Unknown said...

Haa bro Monday morning,charles and Laura barishter parvatheesam enno manchi lessons undevi...old text books asalu dhorakatle

Jagadish Kari said...

if any body know the name of 7th class English Supplementary textbook year 2005 , please let me know.

Unknown said...

lesson peru " pattudala unte kanidi lefu".

Unknown said...

lesson name " chandamama kadha".

రఘురామ్ said...

కాశ్మీర్ దీపానికి నుండి గ్రహించిన కాశ్మీర్ దర్శనం పాఠం

రఘురామ్ said...

వరుణుడుని జీమూతవాహనుడు అని అంటారు.

kingsbirth said...

దుర్గా చరణ్ దాస్

kingsbirth said...

దుర్గా చరణ్ దాస్

Jagadish Kari said...

Naku chala santhosam ga undi.. na mundu generation valu blogs ni chala chakkaga use chestunaru.. appatlo Internet usuage chala baga use chesaru.. Ma generations blogs ki unna value teleydam ledhu.
i am happy to see a good people over here.. Cheers
Jagadish Kari
1994 born kid

శర్మ said...

నాఢీజంఘుడు కథ

Unknown said...

Yes , Durgacharanudu

Unknown said...

Yes 10th class. Rikshavadu by tripuraneni gopichand

kingsbirth said...

Yes

Anonymous said...

Shobanadri...Raju raithu...rikshavadu...konni gurthunna lessons

Anonymous said...

నాగమహాశయుడు.

suman said...

any one has 7th class telugu book.i need kashmira darshanam lesson

శ్రీ లక్ష్మీ said...

నాయిని క్రిష్ణకుమారి గారి రచన కాశ్మీర దీప కళిక నుండి,కాశ్మీర దర్శనం అనే పాఠ్యాంశం నా పదవ తరగతిలో ఉండగాచదివాను, నేనిప్పటికీ కాశ్మీర్ యాత్రా చేయలేదు, కానీ నా జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు చేస్తాననే నమ్మకం గట్టిగా వుంది.చిన్నతనంలో చదివిన పాఠం మా గురువుగారు శ్రీ లక్ష్మా రెడ్డి గారు ఈ పాఠ్యాంశం కాశ్మీర్ దర్శనం చెబుతుంటే అది కళ్ళకు కట్టినట్లు కాశ్మీర్ దర్శనం చేసినట్లు అనిపించేది,అప్పుడే నిర్ణయించుకున్నాను కాశ్మీర్ దర్శనం చేయాలనీ.నా 10 వ తరగతి 1996-1997

Anonymous said...

తరగతి గుర్తు లేదు కానీ కొల్లేటి సరస్సు అనే పాటం ఉండేది
అల్లూరి సీతారామరాజు పాఠం ఉండేది
సైన్స్ లో పనిముట్లు అనే పాఠం గుర్తు ఉంది
రాజు ముసలి
సాహస బాలులు
అట్లతద్ది
ఖడ్గ తిక్కన
బమ్మెర పోతన
కవిత్రయం
మొల్ల
మాగంటి అన్నపూర్ణ దేవి
మూడు చేపల కథ
కొత్తగా వచ్చిన వారిని నమ్మ రాదు

పల్లవులు, చోళులు, కనిష్కుడు, ఫ్యూడల్ వ్యవస్థ, ఇవి బాగా గుర్తు వున్నాయి.