Sunday, September 11, 2005

ఐదారేడు తరగతుల ఇంగ్లీషు పుస్తకాలు

ఐదారేడు తరగతుల ఇంగ్లీషు పుస్తకాలు:

Japan లో సెట్ అయిన లెసన్ ఒకటుండేది. ముగ్గురు పిల్లలుంటారు. వాళ్లలో ఒకరింట్లో రెండో మూడో రాతి సింహాలుంటాయి.
Don Quixote, Sancho Panza ల పైన ఒక పాఠముండేది. ఒక సింహాన్ని Don Quixote control చేస్తాడు. ఇది ఏడో తరగతేమో?
రేడియం పైన ఒక పాఠం.
నెహ్రూ ఇందిరాగాంధీకి రాసిన ఒక లెటర్.
Two Gentlemen of Verona అని second world war time లో set చేసినది ఒకటి.
A Tale of Two Cities based lesson ఒకటి.

Non-detailed textbooks ఆరుకి Trojan War, ఏడుకి Gulliver's Travels అనుకుంటా.
Monday Morning అని ఆరులోనో ఏడులోనో ఇంకో Non-detailed text ఉండేది short stories తో.

Monday, August 01, 2005

ఐదారేడు తరగతుల తెలుగు పుస్తకాలు

ఈ మూడు తరగతులూ కలిసిపోయి ఒక blur లా ఉన్నాయి.

పరివర్తన అని ఒక పాఠం ఉండేది. ఒకామె చాలా మంచిది కానీ ఆమె భర్త చెడ్డవాడు. ఆయన రాత్రిపూట ఒక మర్రిచెట్టు దగ్గరికెళ్తే బ్రహ్మరాక్షసుడిగా మారిపోవడంలాంటిదేదో చేస్తుంటాడు. ఇది ఐదనుకుంటా.

ఆర్కిమిడిస్ పైన ఒక పాఠం ఉండేది. దాని తర్వాతే దుర్గాదాస్(?) అనే ఆయన చిన్నప్పటి సంఘటన గురించి ఒక పాఠం ఉండేది. దుర్గాదాస్ (అనుకుందాం) ఢాకా వరకూ నడిచివెళ్లి చదువుకుంటుంటాడు. ఒకరోజు రాత్రి బాగా వర్షంపడుతుంది.

ఇనుపకండలు-ఉక్కునరాలు అనే పాఠంలో కోడి రామ్మూర్తిగారి గురించి ఉండేది.

ఏడులో మొదటిపాఠం సువర్ణష్ఠీవి. చాలామందికి గుర్తుండుంటుంది. అతడసలే "రూపసి" కూడా!

ఏడులో మాడపాటి హనుమంతరావు, మాగంటి(?) అన్నపూర్ణాదేవి (M.A.D అనేవారు) లపై పాఠాలుండేవి.

ఐదులోనేమో దుర్గాబాయి దేశముఖ్ పైన ఒక పాఠముండేది. ఆమెని చిన్నప్పుడు ఒక event కి కాపలా పెడితే నెహ్రూని కూడా టికెట్ లేకుండా లోపలికి రానివ్వదు.

ఇంకొక standard lesson ఉండేది. ఒక ముసలివాడు మామిడి టెంక నాటుతుంటే ఒక రాజు వెక్కిరిస్తాడు. ఆ ముసలివాడు అప్పుడు point explain చేస్తాడు. నార్లవారి రచన అనుకుంటా ఇది.

ఆరేడు తరగతుల్లో తెలుగు non-detailed texts మదర్ థెరెసా, సరోజిని నాయుడు అనుకుంటా.

పాఠంలో ఏముంటే మనకి ఏళ్లు గడిచినా గుర్తుంటుందనేదాన్ని రిసెర్చ్ చేయాలి. M.A.D లాంటివాటికి ఎవరూ ఏమీ చేయలేరుగానీ ప్రతిపాఠంలో కనీసం ఒక్క remarkable విషయాన్నన్నా పెట్టగలగాలి.

Thursday, July 14, 2005

మూడు, నాలుగు తరగతుల ఇంగ్లీషు పుస్తకాలు

ఇవి కొంచెం బాగానే గుర్తున్నాయి. ఏది ఏ క్లాసో మాత్రం సరిగా గుర్తులేదు, కొన్ని తప్ప:

* ఒక fake school teacher ఉంటాడు. వాడికి చదువు రాకపోయినా స్కూలు పెడతాడు. ఒకామె ఏదో letter తెచ్చి చదివిపెట్టమంటే ఆమె భర్త చనిపోయాడు అన్నట్లు చెప్తాడు ఆమెకి. విషయం అది కాదని తెలిసినతర్వాత వాడిని కొట్టడమో ఏదో చేస్తారు.

* పర్షియాలో ఒక కార్పెట్స్ నేసేవాడికి నలుగురు కొడుకులు. వాళ్లందరూ కలిసి మంచి కార్పెట్స్ నేస్తుంటారుగానీ తగాదాలొచ్చి విడిపోతారు. వారి రాకుమార్తె పెళ్లికి ఏదో contest పెడతారు బెస్ట్ కార్పెట్ కోసం. వాళ్ల నాన్న అప్పుడు, పుల్లల్ని తెచ్చి విరవమంటాడు వీళ్లని. ఒక్కో పుల్లనీ వాళ్లు easy గా విరిచేస్తారు. అప్పుడు ఆయన వాటినే కట్టగా కట్టి విరవమంటాడు. వీళ్లకి విషయం అర్థమై కలిసి పనిచేసి contest లో గెలుస్తారు.

* త్యాగరాజు గురించి ఒక పాఠం ఉండేది.

* అల్లావుద్దీన్ మీద రెండు పార్ట్స్ తో ఒక పాఠం ఉండేది.

* జీసస్ మీద ఒక పాఠంలో ఆయన చుట్టూ చాలా జనం ఉండి వాళ్లకి food సరిపోకపోతే మిరకిల్ చేసి అందరికీ సరిపోయేలా సృష్టిస్తాడు.

* మూడులోనో, నాలుగులోనో ఇది ఆఖరి పాఠాల్లో ఒకటి. ఇదికూడా సాహసబాలిక టైప్ పాఠం. ఒక రోడ్ లో చాలా స్పీడ్ తో ఒక లారీ వస్తుంటే ఒక పిల్లవాడు ఎవరినో రక్షిస్తాడు.

* గలివర్ గురించి కూడా నాలుగులోనేమో రెండు పార్ట్స్ తో ఒక పాఠం ఉండేది.

* amma అనే పేరుతో ఒకపాప వాళ్లింట్లో ఉన్నప్పుడు ఒక చిరుతపులి వాళ్లింట్లోకి వస్తుంది. ఆ పాఠమంతా పులినుంచి ఆ పిల్ల ఇంట్లోనే ఉండి తప్పించుకోవటమే. ఆఖర్లో వాళ్ల నాన్నవచ్చి దాన్ని తుపాకీతో కాల్చేస్తాడు. ఇది కచ్చితంగా నాలుగులోదే. ఐదుకి తిరుపతినుంచి నెల్లూరికి వెళ్తే అక్కడ విశ్వభారతి హైస్కూల్లో (madras bus stand, trunk road, any one?) "entrance test" పెట్టి ఈ పాఠం summary రాయమన్నారు.

* నాలుగులోనేననుకుంటా ఇంకో రెండు పార్ట్స్ ఉండే పాఠముండేది. Elisha అనొకడూ, Efim అనొకడూ ఉంటారు. వాళ్లు జెరూసలెం వెళ్దామని కలిసి బయలుదేరుతారు. ఒకడు దార్లో నీళ్లకోసమని ఒకింట్లో ఆగి వాళ్ల దీనస్థితిచూసి వాళ్లకి సహాయంచేస్తూ ఉండిపోయి, డబ్బంతా అయిపోతే ఇక జెరూసలెంకి వెళ్లకుండా వెనక్కొచ్చేస్తాడు. ఇంకొకడు మాత్రం జెరూసలెం చేరుతాడుగానీ అక్కడ వాడికి ఎక్కడచూసినా Elisha నే కనిపిస్తాడు అతనక్కడ నిజంగా లేకపోయినా.

* ఒక గ్రామంలో రాత్రిపూట దొంగలు పడతారు. ఒక పిల్లవాడు వాళ్లని ఎదుర్కునేందుకు ఆ ఊరివాళ్లకి బాగా సహాయం చేస్తాడు. Bricks అవీ విసురుతాడు ఆ చీకట్లో. కానీ ఇది ఐదులోదేమోనని చిన్న అనుమానం.

Corrections? Additions? Suggestions?

విజయ్ - తిరుపతి

Wednesday, July 13, 2005

మూడు, నాలుగు తరగతుల తెలుగు పుస్తకాలు

ఈ పాఠాలుకూడా ఏవి ఏ క్లాసువో సరిగా గుర్తులేదు. కానీ, మూడు, నాలుగులలోవే అని గుర్తుంది.

* సుమతి, కాలమతి, మందమతి అనే మూడు చేపల కథ ఒకటుండేది.

* 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఒక పాఠంగా ఉండేది. విళంబి, వికారి అనే సంవత్సరాలు పక్కపక్కన వస్తాయి. ఇంకా రుధిరోద్గారి అని ఒక సంవత్సరం ఉండేది.

* ఒక పిల్లవాడు సెలవులొస్తే వాళ్ల తాతతోనేమో రైలెక్కి వాళ్ల ఊరికి వెళతాడు. Focus మొత్తం railway station పైనుంటుందనుకుంటా పాఠంలో.

* ఇంకొక పిల్లవాడికి పుట్టినరోజొస్తుంది. వాళ్లమ్మ వాడికి తలస్నానం చేయించి కొత్తబట్టలు తొడిగితే వాళ్లనాన్న ఒక కొత్త Diary ఇచ్చి "దినచర్య" importance గురించి చెప్తాడు. ఇదెందుకు గుర్తుందంటే మా క్లాస్ లో (తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరా Children's High School, just in case some one from there reads this blog), ఈ పాఠాన్ని చిన్న skit లా వేయించారు.

* సాహసబాలిక అనేమన్నా ఒక పాఠం ఉండేదా? బావిలో ఎవరో పడిపోతే రక్షించినందుకు ఒకమ్మాయికి national award ఇస్తారు...

* కవిత్రయం అని ఒక పాఠం ఉండేది. కానీ అది ఐదులోనేమో.

Corrections? Additions? Suggestions?

విజయ్ - తిరుపతి

Tuesday, July 12, 2005

ఒకటి, రెండవ తరగతుల ఇంగ్లీషు పుస్తకాలు

ఇవి నాకు గుర్తున్న (Andhrapradesh State Syllabus) మొట్టమొదటి క్లాసు పుస్తకాలు. విచిత్రమేమిటంటే మూడు, నాలుగేళ్ల క్రితమొకసారి చూస్తే ఇంకా వీటినే చెప్తున్నారు. నాకు గుర్తున్న కొన్ని పాఠాలు కింద రాశాను. ఎవరికన్నా గుర్తొస్తే కరెక్టో, సజెస్టో చేయండి. అలా ఒక్కో తరగతీ (ఇప్పటికి ఇంగ్లీషు, తెలుగు) పూర్తి చేసుకుంటూ వెళదాం. :

* ఇదొక కథ. ఒక రాణి ఎప్పుడూ కొత్త dresses మాత్రమే వేసుకుంటుంటుంది. ఒకసారి వాడినవి ఇంకోసారి వాడకుండా. ఆమె ఒక shawl ని అలాగే కిటికీలోనించి విసిరేయడం ఒకడు చూస్తాడు. దాన్ని మళ్లీ ఆమె దగ్గరికే తీసుకెళ్తాడుగానీ ఆమె దాన్ని గుర్తుపట్టదు. దాన్ని మళ్లీ ఆమెకే అమ్మేస్తాడు.

* Venus's Fly Trap plant గురించి ఒక పాఠం ఉండేది.

* ఒకడేవో "Stationery" వస్తువులు తీసుకుని రైలెక్కుతాడు. ఈ పాఠంలో ఒక దొంగ ఉంటే ఉండొచ్చు. అంతకంటే గుర్తులేదు.

* ఒక పిల్లవాడు వాళ్ల అమ్మానాన్నలతో కార్లో ఒక గుడికి వెళ్తాడు. గుడి మెట్లెక్కుతుంటే కోతులూ అవీ వస్తాయి.

* ఒక పాప వాళ్ల అమ్మతో shopping కి వెళ్తుంది. "loaves of bread" కొంటారు వాళ్లు(!)

ఒకటో క్లాసులో మనకసలు ఇలాంటి పాఠాలు ఉన్నాయా? లేకపోతే అన్నీ రెండు లోవేనా? ఇంకా ఎవరికన్నా details గానీ, వేరే పాఠాలుగానీ గుర్తుంటే రాయండి. గుర్తు తెచ్చుకుని రాయండి. ఇండియాలో ఎవరికన్నా ఒకవేళ textbook access ఉన్నాగానీ దయచేసి దాన్నిచూసి రాయొద్దు. At least, not yet. నిజంగానే textbook దొరికితే, కొంచెం కష్టపడిన తర్వాత చేయొచ్చు ఆ పని.

విజయ్ - తిరుపతి